కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్.. పవర్‌ఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇచ్చేసిన హీరో..

by I. Sairam |   (  Updated:2025-07-07 05:51:55  IST  )

కన్నడ స్టార్ హీరో రిష‌బ్ శెట్టి(Rishab Shetty) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’(Kanthaara).

కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్.. పవర్‌ఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇచ్చేసిన హీరో..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో రిష‌బ్ శెట్టి(Rishab Shetty) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’(Kanthaara). సప్తమి గౌడ(Sapthami Gouda) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ విజ‌యం సాధించింది. అంతే కాకుండా 25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది ప్ర‌పంచ వ్యాప్తంగా 400 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్ట‌ర్‌-1 తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ మూవీని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అలాగే హీరో రిషబ్ శెట్టి క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పోస్టర్‌లో హీరో అగ్ని గుండం నుంచి సీరియస్‌గా ఎవరినో నరకడానికి చేతిలో గొడ్డలి పట్టుకొని జెడ్ స్పీడ్‌లో వస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు రిషబ్ ముఖం పూర్తిగా కనిపించలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన బర్త్‌డే పోస్టర్‌లో మాత్రం ఆయన పవర్‌ఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ అందించారు. ఇక దీన్ని చూసిన అభిమానులు ఇది కదా అసలు సిసలైన ఫస్ట్ లుక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. కాగా సినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. Link

Next Story