- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బాలన్ – ది బాయ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
by Pulgam srinivas |
"బాలన్ ది బాయ్" చిత్రాన్ని జూన్ 19న మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

X
దిశ, వెబ్ డెస్క్: మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరం ప్రస్తుతం “బాలన్ ది బాయ్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆవేశం’ చిత్ర దర్శకుడు జితూ మాధవన్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూన్ 19న మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాపై మలయాళ ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగులో ఇంకా పెద్దగా హైప్ కనిపించడం లేదు. కానీ విడుదలకు ముందు వచ్చే ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగు మార్కెట్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story






