దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీ వచ్చేసింది

by Pulgam srinivas |   (  Updated:2026-06-15 04:38:26  IST  )

‘ఐ యామ్ గేమ్’ చిత్రాన్ని ఈ ఏడాది ఓనం సందర్భంగా ఆగస్టు 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కయాదు లోహర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఓనం సందర్భంగా ఆగస్టు 20వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, కతిర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ ‘వేఫెరర్ ఫిలిమ్స్’, జోయ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్ ఆఖరుగా ‘కాంత’ సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ‘ఐ యామ్ గేమ్’ చిత్రంతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

‘మా ఇంటి బంగారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఫిక్స్

Next Story