అప్పటినుండి స్టార్ట్ కానున్న ‘మంగళవారం 2’ రెగ్యులర్ షూటింగ్

by Pulgam srinivas |

‘మంగళవారం 2’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అప్పటినుండి స్టార్ట్ కానున్న ‘మంగళవారం 2’ రెగ్యులర్ షూటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మంగళవారం’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మంగళవారం 2’ రూపొందించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగస్వామి కానున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ వెలువడింది. ‘మంగళవారం 2’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అజయ్ భూపతి ఇటీవల ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే అజయ్ భూపతి నుంచి రాబోయే ‘మంగళవారం 2’పై కూడా భారీ అంచనాలు నెలకొనే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story