- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి బాధ్యతలు తలకెత్తుకున్న "ఎర్రమందారం"
ఇంటి బాధ్యతలు మోసే తండ్రి చనిపోతే ఆడి, పాడాల్సిన వయస్సులో ఇంటిపెద్దగా బాధ్యతలు తలకెత్తుకున్న కూతురు కథ "ఎర్రమందారం".

ఇంటి బాధ్యతలు మోసే తండ్రి చనిపోతే ఆడి, పాడాల్సిన వయస్సులో ఇంటిపెద్దగా బాధ్యతలు తలకెత్తుకున్న కూతురు కథ "ఎర్రమందారం". అదమ్య ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో, దీక్ష గోయెల్ నిర్మాతగా, వలసాల మోహన్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి మని కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. 1990 దశకంలో తెలంగాణలోని ఓ మారుమూల కుగ్రామంలోని నిరుపేద కుటుంబంలో జరిగిన కథే ఇది. నిజ జీవితంలో మనకు తారసపడే కుటుంబాల కథలు, కన్నీళ్లు ఇందులో కనిపిస్తాయి. ప్రధాన పాత్ర పోషించిన కీర్తితోపాటు కార్తికేయ, రాజీకన్నా, మౌనిక బూసం, సంధ్య బూరుగుపల్లి తదితరులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. తరుణ్ కుమార్ రాకేషియా కెమెరా పనితనం ఈ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది. 90లలోని తెలంగాణ కుగ్రామంలోకి మనల్ని తీసుకువెళ్లి కూర్చోబెడతారు. అనవసర రణగొణ ధ్వనులు లేకుండా యశ్వంత్ నాగ్ ఇచ్చిన సంగీతం కూడా చక్కగా కుదిరింది.
ఇది కేవలం ఒక్క ప్రధాన పాత్ర కథే అనుకుంటాం గాని, ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఓ తీరని గాథ ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెబుతాడు. మనకు రోజూ బయట కనబడే సాధారణ మనుషుల ప్రవర్తనే స్క్రీన్ మీద కనిపిస్తుంది. తూకం వేసినట్టు పాత్రకు ఎంత అవసరమో అంత వరకే నటించారు గాని ఎక్కడా ఏ ఒక్క పాత్ర హద్దులు దాటి అతిగా ఉన్నట్టు అనిపించదు. అలాంటి నటీనటులను ఎంపిక చేసుకుని డైరెక్టర్ ను మెచ్చుకోకుండా ఉండలేం. డైలాగ్స్ రాసిన రూపక్ రొనాల్డ్స్, గోపీకృష్ణ శాఖాపూర్ లు... ఆ కాలానికి వెళ్లి రాసుకువచ్చినట్టు అనిపిస్తుంది. ఒక చక్కటి గ్రామీణ నేపథ్యం, ఎలాంటి అనవసర హంగామా లేని కుటుంబ కథా చిత్రం "ఎర్ర మందారం" అని చెప్పవచ్చు.






