ఆర్య రీ-రిలీజ్ డేట్ వచ్చేసింది

by Pulgam srinivas |

'ఆర్య' చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆర్య రీ-రిలీజ్ డేట్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అనురాధ మెహతా హీరోయిన్‌గా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'ఆర్య' చిత్రం 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. గత కొంతకాలంగా 'ఆర్య' చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తుండగా, తాజాగా మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళం భాషలో రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'హ్యాపీ' చిత్రాన్ని కేరళలో రీ-రిలీజ్ చేయగా అక్కడ ఆ సినిమా విశేష స్పందనను సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పుడు 'ఆర్య' కూడా రీ-రిలీజ్‌లో భారీ కలెక్షన్లు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రీ-రిలీజ్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Next Story