- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరోయిన్‌కు స్పెషల్ విషెస్ తెలిపిన ఆర్ సి-16 మూవీ టీమ్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్
అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఆర్ సి-16’(Rc-16) మూవీలో నటిస్తుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. నేడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు(Birthday) సందర్భంగా ఆర్ సి-16 మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌తో విషెస్ తెలిపారు. నైట్ టీ షర్ట్, ప్యాంట్ వేసుకున్న జాన్వీ ఓ చేతిలో చిన్న గొర్రె పిల్లను పట్టుకుని మరో చేతిలో కట్టెను పట్టుకుని క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ బ్యూటీ ఈ సినిమాలో ఓ టెర్రఫిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.






