The Raja Saab: ది రాజాసాబ్ సినిమాకు షాకింగ్ ర‌న్ టైం.. 3 గంట‌ల‌కు పైగా !

by velandi.Saikiran |

హీరో ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా సి

The Raja Saab: ది రాజాసాబ్ సినిమాకు షాకింగ్ ర‌న్ టైం.. 3 గంట‌ల‌కు పైగా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది హీరోలు మాత్రమే సక్సెస్ దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో హీరో ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. అలాంటి హీరో ప్రభాస్, ది రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 లో జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. టీజీ విశ్వప్రసాద్ , ఇషాన్ సక్సేనా ప్రొడ్యూసర్లుగా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో మాళవిక మోహన, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అలాగే మలయాళం భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమా రన్ టైం గురించి వన్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా మూడు గంటల 15 నిమిషాల పాటు నిడివి ఉంటుందట.

ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా మూడు గంటలకు పైగా నిడివి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. మూడు గంటలకు పైగా ఉన్న సినిమాను జనాలు ఆదరిస్తారా ? లేదా? అనే టెన్షన్ లో పడ్డారు ఫ్యాన్స్. గతంలో రిలీజ్ అయిన ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు, భారీ విజయాలను నమోదు చేసుకున్న చరిత్ర లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైంది.

Next Story