ది రాజాసాబ్‌ మూవీ సెన్సార్ పూర్తి.. 3 గంట‌ల‌కు పైగానే ర‌న్ టైం !

by velandi.Saikiran |

U/A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు

ది రాజాసాబ్‌ మూవీ సెన్సార్ పూర్తి.. 3 గంట‌ల‌కు పైగానే ర‌న్ టైం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ తరుణంలో U/A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ది రాజా సాబ్ టైం కాస్త తగినట్లు తెలుస్తోంది.

ముందుగా మూడు గంటల 15 నిమిషాలు ఈ సినిమాను అనుకున్నారట. అయితే ట్రిమ్ చేయగా, ఈ సినిమా 183 నిమిషాల నిడివి మాత్రమే ఉండనుందట. అంటే దాదాపు మూడు గంటలకు పైగా మూవీ అన్నమాట. కాగా ప్రభాస్ నటించినది రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహన్, రిద్ది కుమార్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.

Next Story