- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Raja Saab: హాట్ స్టార్ చేతికి ఓటీటీ హక్కులు...ఎన్ని కొట్లంటే ?
రూ.100 కోట్లు, రూ.150 కోట్లు, రూ. 200 కోట్లు ఇలా చేసుకుంటూ పోతే అదనంగా హాట్ స్టార్ మరికొంత మొత్తాన్ని నిర్మాతలకు

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్ ( TheRajasaab ). సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. జనవరి 9వ తేదీన ఈ సినిమాను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. అయితే రిలీజ్ కంటే ముందే, ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాకు దక్కని ధర ఈ మూవీకి వచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ ది రాజా సాబ్ సినిమా ఓటీటీ హక్కులు బేసిక్ ధర 140 కోట్ల రూపాయలు అని టాక్ నడుస్తోంది.
బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ రేటు పెరుగుతుందని చెబుతున్నారు. రూ.100 కోట్లు, రూ.150 కోట్లు, రూ. 200 కోట్లు ఇలా చేసుకుంటూ పోతే అదనంగా హాట్ స్టార్ మరికొంత మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించాల్సి ఉంటుందట. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే, నిర్మాతలకు పంట పండినట్లేనని అంటున్నారు. కాగా ఈ సినిమాను మారుతి డెరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తుండగా, మాళవిక, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా ఉండనున్నారు.






