- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఛాంపియన్‘ నుంచి సెకెండ్ సింగిల్ ‘సల్లగుండాలే‘ ప్రోమో అవుట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
అలనాటి స్టార్ హీరో శ్రీకాంత్ (Srikanth) తనయడు రోషన్(Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’(Champion).

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరో శ్రీకాంత్ (Srikanth) తనయడు రోషన్(Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’(Champion). ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) కథానాయికగా నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దాదాపు 35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది. అంతేకాకుండా ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్ 'సల్లగుండాలే' ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మిమ్మల్ని ఒక హృదయపూర్వక ప్రయాణంలోకి తీసుకెళ్లడానికి అంతా సిద్ధంగా ఉంది.. రెండవ సింగిల్ #సల్లంగుండలే రేపు విడుదలవుతోంది. పాట ప్రోమో ఇప్పుడు విడుదలైంది.. డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో హీరో హీరోయిన్ విలేజ్ థీమ్‌లో రెడీ అయి డ్యాన్స్ వేస్తుండగా.. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి వైట్ కలర్ గడ్డం మీసాలతో నుదుటిన బొట్టు పెట్టుకొని గంభీరంగా చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






