Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్యను ఇబ్బంది పెడుతున్న నిర్మాత.. అసలు విషయం చెప్పేసిన యంగ్ హీరోయిన్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-22 14:20:46  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్యను ఇబ్బంది పెడుతున్న నిర్మాత.. అసలు విషయం చెప్పేసిన యంగ్ హీరోయిన్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘బేబీ’(baby)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆనంద్ దేవరకొండ (anand dewarakonda) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సాయి రాజేష్ (sai rajesh) తెరకెక్కించగా.. ఎస్ కేఎన్ నిర్మించారు. అయితే ఈ సినిమా 2023లో వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి హిట్‌గా నిలవడంతో పాటుగా భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా వైష్ణవి చైతన్య నటనకు కూడా బాగానే మార్కులు పడ్డాయి. మొదటి చిత్రమే హిట్ కావడంతో అమ్మడు క్రేజ్ బాగానే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. ఇటీవల నిర్మాత ఎస్ కేఎన్ ఓ మూవీ ఈవెంట్‌లో భాగంగా వైష్ణవి చైతన్యను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో నాకు బాగా తెలుసు అని చేసిన వ్యాఖ్యలు వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అన్నాడని అప్పట్లో వివాదం అయింది. దీంతో అంతా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్ కేఎన్ వివరణ ఇచ్చారు. తన టార్గెట్ మొత్తం 25 మంది అమ్మాయిలను పరిచయం చేయడమే అని అన్నారు. అలాగే తనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. తాజాగా, ఇదే విషయంపై యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య స్పందించింది. ఓ ఈవెంట్‌లో ఆమె పాల్గొనగా ఓ రిపోర్టర్ ‘‘ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు మీ గురించే అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సంస్థతో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఆ నిర్మాత మిమ్మల్ని అలా అనడం మీకేలా అనిపించింది’’ అని అడిగాడు. దానికి వైష్ణవి చైతన్య రియాక్ట్ అవుతూ.. ఎస్ కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్య కానీ గొడవ వంటివి లేవు.

ఆయన గతంలో చేసిన కామెంట్స్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదం అప్పుడే ముగిసింది. ఆయన వివరణ ఇచ్చిన సమయంలో నా పేరును మెన్షన్ చేయనప్పుడు నన్నే అన్నారని ఎలా అనుకుంటాను. నేను ఎందుకు స్పందిస్తాను. నేను మరోసారి బేబీ టీమ్‌తో వర్క్ చేయాలి కానీ అది మిస్ అయింది. మళ్లీ చాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వివాదానికి చెక్ పడినట్లు అయింది. కాగా, వైష్ణవి చైతన్య సినిమాల విషయానికొస్తే.. ఈ భామ సిద్దు జొన్నలగడ్డ (siddu jonnalagadda) సరసన ‘జాక్’ (jack)మూవీలో నటిస్తోంది. దీనిని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బివి ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్ (prakash raj), బ్రహ్మాజీ వంటి స్టార్ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీంతో మూవీ మేకర్స్ నిత్యం ‘జాక్’ నుంచి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

Next Story