పెద్ది రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన నిర్మాత SKN

by Pulgam srinivas |

తాజాగా నిర్మాత SKN మాట్లాడుతూ... ‘పెద్ది’ సినిమాను జూన్ 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మాకు తెలిసిందని చెప్పుకొచ్చారు.

పెద్ది రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన నిర్మాత SKN
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంతకాలం క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీన సినిమా విడుదల కావడం కష్టమని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ బృందం నిర్వహించిన 'గుర్తుందా సాంగ్' విడుదల ఈవెంట్‌లో నిర్మాత SKN కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ… తమ సినిమాను జూన్ 26న విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశామని, అయితే అదే తేదీన రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాజేష్ గారు ఇప్పుడే చెప్పారని తెలిపారు. దాంతో తమ సినిమాను ఆ తేదీ నుండి తప్పిస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలతో 'పెద్ది' సినిమాను జూన్ 26న విడుదల చేయడం ఆల్మోస్ట్ ఖరారు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story