- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sandhya Theatre: థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి.. స్పందించిన ‘పుష్ప-2’ నిర్మాణ సంస్థ
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్ర(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్ర(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా, బాలుడికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) స్పందించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. మహిళ మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డామని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా ఈ సినిమాను విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. బుధవారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్(Allu Arjun) యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ హైలైట్ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, సంధ్యలో ఏర్పాటుచేసిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. అభిమానులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. ఆయన్ని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీనిపై ఇప్పటికే బన్నీ స్పందించారు. ఇది నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు.






