- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లాక్‌డౌన్’ రాకకు ముహూర్తం ఫిక్స్
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన‘లాక్‌డౌన్’ చిత్రంపై అధికారిక ప్రకటన గత ఏడాదే రాగా.. ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు.

దిశ, సినిమా: సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘లాక్ డౌన్’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై అధికారిక ప్రకటన గత ఏడాదే రాగా.. ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. మొదట ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చెయ్యగా.. కొన్ని అనివార్య కారణాల చేత ‘లాక్ డౌన్’ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ‘లాక్ డౌన్’ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఇక ఈ చిత్రం దర్శకుడు ఏ.ఆర్. జీవా ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూట్. లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్ బ్యాకింగ్‌లో రూపొందిన ఈ మూవీలో అనుపమాతో పాటు చార్లీ, నిర్మల, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నుంచి ఈ ఏడాది స్టార్టింగ్‌లో విడుదలైన టీజర్‌లో అనుపమా ఖాళీ సడెన్‌షట్ స్ట్రీట్స్‌లో తిరుగుతూ కనిపిస్తుంది. ఇది ఎమోషన్స్‌తో కూడిన, సస్పెన్స్ సినిమా అని అర్థమవుతుండగా.. ప్రధానంగా ఐసొలేషన్ ఐడియాతో థ్రిల్ సృష్టిస్తూ, కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇక ఈ టీజర్‌తో మూవీపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.






