Sharwanand: ఆ నిర్మాత చేతికి 'బైకర్', 'భోగి' డిజిటల్ హక్కులు

by Pulgam srinivas |

శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'బైకర్', 'భోగి' సినిమాల డిజిటల్ హక్కులను మ్యాంగో రామ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Sharwanand: ఆ నిర్మాత చేతికి బైకర్, భోగి డిజిటల్ హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటులలో శర్వానంద్ ఒకరు. హీరోగా కెరీర్ను ప్రారంభించిన తర్వాత వరుసగా చాలా విజయాలను అందుకొని తక్కువ సమయంలోనే మంచి స్థాయికి చేరుకున్న ఈ నటుడు ఆ తర్వాత భారీ అపజయాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలోనే ఈయనకు ఒకే ఒక జీవితం, మనమే సినిమాలతో పరవాలేదు అనే స్థాయి విజయాలు దక్కాయి.

శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో ఈ నటుడు ఫామ్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం ఈ హీరో బైకర్, భోగి చిత్రాల్లో నటిస్తున్నాడు. బైకర్ చిత్రానికి అభిలాష్ సంకల్ప రెడ్డి, 'భోగి'కి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శర్వానంద్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో మళ్లీ మంచి విజయాలు సాధిస్తుండడంతో ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

దాంతో బైకర్, భోగి సినిమాల డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తాజాగా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి డిజిటల్ హక్కులను మొదట మ్యాంగో రామ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దానిని వేరే ఓటీటీ సంస్థకు అమ్ముకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న బైకర్, భోగి సినిమాల హక్కులను కూడా మ్యాంగో రామ్ సొంతం చేసుకున్నట్లు, అందుకు సంబంధించిన డీల్ కూడా ఇప్పటికే క్లోజ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

Next Story