ఒక్క టికెట్ ధర రూ. 90,౦౦౦.. ఆ సినిమాకు ఎంత పెట్టిన తక్కువే!

by Chukka Sudharani |

‘డ్యూన్ 3’ సినిమా ఒక్క టికెట్ ధర రూ. 90,౦౦౦.

ఒక్క టికెట్ ధర రూ. 90,౦౦౦.. ఆ సినిమాకు ఎంత పెట్టిన తక్కువే!
X

దిశ, సినిమా: కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే బెనిఫిట్ షోలకు టికెట్స్ రేట్స్ పెంచడం కామన్. సాధారణంగా ఇవి రూ. 1000 వరకు ఉంటాయి. కానీ ఓ సినిమాకు మాత్రం ఫ్యాన్స్ ఏకంగా రూ. 90,000 వేలు పెట్టి టికెట్ కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ మేనియా వరల్డ్ వైడ్‌గా అప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఐమ్యాక్స్ 70mm టికెట్లు బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడం ఇప్పుడు షాకింగ్‌గా మారింది. ‘డ్యూన్ 3’ ఒక్కో టికెట్ ధర ప్రస్తుతం రీసేల్ మార్కెట్‌లో ఏకంగా రూ. 90,000 వరకు పలుకుతుంది. అయినా కూడా అమ్ముడు పోవడంతో ఈ సినిమా కోసం సినిమా లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

అంతే కాకుండా.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. అయితే..​ఈ టికెట్ ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm స్క్రీన్స్ కొరత. అమెరికా అండ్ యూకే మొత్తం కలిపి కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ అందుబాటులో ఉందని తెలుస్తుండగా... స్క్రీన్స్ కొరత, డిమాండ్ ఎక్కువ ఉండటంతో బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల రేట్లు ఏకంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తక్షణమే ఐమ్యాక్స్ 70mm స్క్రీన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తుంటే.. ‘డ్యూన్ 3’ ఐమ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.

Next Story