Dada Saheb Phalke Film Festival: 'క' చిత్రాన్ని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు

by Yella Dhawani Reddy |

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన 'క' (KA) చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

Dada Saheb Phalke Film Festival: క చిత్రాన్ని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన 'క' (KA) చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dada Saheb Phalke Film Festival)'లో ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. ఓ తెలుగు చిత్రాన్ని ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు వరించటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా కొత్త దర్శకుడు సుజిత్, సందీప్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీ ఉపయోగించి ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి సెకండ్ పార్టు కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పార్ట్‌ 1 విజయం సాధించడంతో పార్ట్‌ 2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైంలో అందుబాటులో ఉంది.

Next Story