మా ఇంటి బంగారం నుంచి ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్.. ఎంతగా ఆకట్టుకుంటుందో..

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది.

మా ఇంటి బంగారం నుంచి ఫ్యామిలీ పోస్టర్ రిలీజ్.. ఎంతగా ఆకట్టుకుంటుందో..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సామ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆడియన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మా ఇంటి బంగారం మూవీ నుంచి మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘మా ఇంటి బంగారం ప్రతి ఇంట్లో ప్రేమతో స్వాగతం. మా ఇంటి బంగారం టీజర్ 20 మిలియన్లకు పైగా డిజిటల్ వీక్షణలను సాధించింది’ అని రాసుకొచ్చింది. ఇక పోస్టర్‌లో సమంత ఫ్యామిలీతో ఉన్నది. అందులో చీర కట్టులో చాలా క్యట్‌గా అనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Next Story