- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగస్టు రేసు నుంచి ఔట్.. మరోసారి వాయిదా పడిన ది ప్యారడైజ్!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడుబోతున్నట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరోసారి వాయిదా పడుబోతున్నట్లు తెలుస్తుంది. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఈ సినిమా మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంది. ముందు సమ్మర్ బరిలో ఈ తీసుకొద్దామని ప్లాన్ చెయ్యగా అవ్వలేదు. తర్వాత ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆగస్టు రేసు నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైమ్‌లో పూర్తి కాలేదట. దీంతో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడకూడదు అనే నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లు టాక్. అందుకే రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ది ప్యారడైజ్ సినిమా వాయిదాపై ఈ వారంలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






