మళ్లీ వాయిదా పడిన ది ప్యారడైజ్.. ఏడాది చివరికి షిఫ్ట్

by Pulgam srinivas |

ది ప్యారడైజ్ చిత్రాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మళ్లీ వాయిదా పడిన ది ప్యారడైజ్.. ఏడాది చివరికి షిఫ్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV Cinemas బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సమయంలో ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమా ఏకంగా ఈ సంవత్సరం చివరికి షిఫ్ట్ అయినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే, ఇప్పటికే డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న కొన్ని సినిమాలకు ఈ చిత్రం గట్టి పోటీగా మారే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Next Story