- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?
నాని హీరోగా వస్తున్నది పారడైజ్ సినిమాకు దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి ఎదిగిన నాని, ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నాడు. అయితే అలాంటి హీరో నాని లేటెస్ట్ గా చేసిన సినిమా ది ప్యారడైజ్. వాస్తవానికి ఈ సినిమా పెద్ది సమయంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఈ ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ పై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 25వ తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు చిత్ర బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ లోపు పెండింగ్ వర్క్ పూర్తి అవుతాయని తెలుస్తోంది. ప్రీమియర్స్ సెప్టెంబర్ 24వ తేదీన ఉంటాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని చిత్ర బృందం భరోసా కల్పించిందట. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కాగా నాని హీరోగా వస్తున్నది పారడైజ్ సినిమాకు దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.






