- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టులో బాక్సాఫీస్ వద్ద పూనకాలే.. ఒక్క రోజు గ్యాప్‌లో రాబోతున్న బడా సినిమాలు
ఆగస్టులో బాక్సాఫీస్ నేచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలు పోటీ బడబోతున్నాయి.

దిశ, సినిమా: ఆగస్టులో సినీ ప్రియులు పండుగా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు ఆ నెలలో ఒక్క రోజు గ్యాప్‌లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ‘ది ప్యారడైజ్ ఒకటి’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ మార్క్ రా & రస్టిక్ మాస్ డ్రామా కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన దసర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘ ది ఫ్యారడైజ్’పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుండగా.. దీనికి పోటిగా ఒక్క రోజు ముందు మరో చిత్రం రాబోతున్నది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐయామ్ గేమ్’ సినిమా కూడా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ‘ఆర్టీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దుల్కర్ కెరీర్‌లో మైలురాయి లాంటి 40వ చిత్రంగా రాబోతుండగా.. అటు మలయాళంతో పాటు టాలీవుల్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాను ఆగస్టు 20న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్. ‘మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత తెలుగులో భారీ మార్కెట్ తెచ్చుకున్న దుల్కర్.. ‘ఐయామ్ గేమ్’తో తగ్గేదే లే అంటున్నాడు. దీంతో ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద పూనకాలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా మెప్పిస్తుందో.. అప్పటికీ ఏదైనా మూవీ వాయిదా పడుతుందో లేక ముందే రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.






