రిలీజ్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్.. రికార్డుల్లో బిజినెస్

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise).

రిలీజ్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్.. రికార్డుల్లో బిజినెస్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise). శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను slv బ్యానర్‌పై చేరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ది ప్యారడైజ్ మ్యూజిక్ రైట్స్‌కు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆడియో హక్కులను సొంతం చేసుకోవడానికి @saregamaglobal ₹18 కోట్లు వెచ్చించినట్లు చిత్ర బృందం కూడా తెలిపారు. ఇప్పుడు మరో అప్‌డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా కలిపి దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా షూటింగ్ స్టార్టింగ్‌లోనే ఉన్న ఈ సినిమా బిజినెస్ ఈ రేంజ్‌లో జరగుతుండటంతో.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్.

Next Story