- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొన్న 'జన నాయగన్'… నేడు 'కేడీ ది డెవిల్'
సెన్సార్ సమస్యలతో సతమతం అవుతున్న కేవీఎన్ ప్రొడక్షన్స్.

దిశ, వెబ్ డెస్క్: కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ బ్యానర్ మొదట డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ మంచి గుర్తింపు సంపాదించిన అనంతరం నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళ్, తెలుగు ఇండస్ట్రీలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా కొంతకాలం క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ తో జన నాయగన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన చాలా పనులను కూడా పూర్తి చేశారు.
అయితే చివరగా సెన్సార్ దశకు చేరుకున్న సమయంలో ఈ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో సెన్సార్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీక్ కావడం కూడా జరిగింది. ఒకవైపు ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అదే నిర్మాణ సంస్థకు మరో సినిమా ద్వారా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ధృవ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన కేడీ ది డెవిల్ చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ నిర్మించింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో ఇప్పటికే యూట్యూబ్ నుంచి ఆ పాటను తొలగించారు. విడుదల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమా కూడా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రంలో రక్తపాతం ఎక్కువగా ఉందని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఐటమ్ సాంగ్‌లోని కొన్ని పదాలను మార్చాలని కూడా సూచించినట్లు సమాచారం. ఈ విధంగా వరుసగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలు సెన్సార్ సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితి నెలకొంది.






