- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కుర్ర హీరో చేతికి చేరిన ఎన్టీఆర్ ప్రాజెక్ట్?
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ యువ దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో నాని హీరోగా నటించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించింది. అద్భుతమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత శౌర్యువ్ ఒక కథను సిద్ధం చేసి దానిని జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించినట్లు సమాచారం.
ఆ స్టోరీపై ఎన్టీఆర్ చాలా ఆసక్తి చూపించినప్పటికీ, ఆయనకు ఉన్న ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దీంతో కొంతకాలం పాటు వేచి చూసిన శౌర్యువ్, చివరకు అదే కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా శౌర్యువ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల కుదరక అది విజయ్ దేవరకొండకు దక్కిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక శౌర్యువ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది విభిన్నంగా ఉండడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.






