- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..ఒకే రోజు నాలుగు మూవీ అప్‌డేట్స్!
RRR బంపర్ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్, అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు కు పైగా సినిమాలను లైన్ లో పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. RRR బంపర్ హిట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు కు పైగా సినిమాలను లైన్ లో పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.
జూన్ 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రోజున నాలుగు భారీ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. డ్రాగన్ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట. దేవర 2 పైన కూడా అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెట్రిమారన్ లాంటి ప్రముఖులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్టులపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక వీటికి సంబంధించిన అప్డేట్స్ వస్తే.. మరింత హైప్ వస్తుంది.






