- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోతో తమన్నా బ్రేకప్ చేసుకుందంటూ వార్తలు.. పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘శ్రీ’(sri) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘హ్యాపీ డేస్’(Happy Days) చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘శ్రీ’(sri) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘హ్యాపీ డేస్’(Happy Days) చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘కాళిదాసు’(Kalidasu), ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’(Koncham Istam Koncham Kastam), ‘100 పర్సెంట్ లవ్’(100% Love), ‘బద్రీనాథ్’(Badrinath), ‘ఊసరవెల్లి’(Oosaravelli), ‘రచ్చ’(Racha), ‘ఎందుకంటే ప్రేమంట’(Endukante Premanta), ‘రెబల్’(Rebel), ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’(Cameraman Gangatho Rambabu), ‘తడాఖా’(Thadaka), ‘ఆగడు’(Aagadu), ‘బాహుబలి’(Bahubali), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘సైరా నరసింహా రెడ్డి’(Syra Narasimha Reddy) వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా తన అందంతో కుర్రకారుకు మత్తెక్కించింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఏమైందో ఏమో కానీ ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేస్తలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. అలాగే మరోపక్కా వెబ్ సిరీస్‌లలోనూ అలరిస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌కి ఫుల్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘జైలర్’(Jailer) మూవీలో ‘నూ కావాలయ్యా నూ కావాలయ్యా’ అనే సాంగ్‌లో చిందులేసింది.
అలాగే ‘స్త్రీ-2’(Sthree-2)లోనూ ‘ఆజ్ కి రాత్’ అంటూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఓదెల-2లో నటిస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ఈ సినిమాలోని టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అలా గత కొంతకాలంగా ఆయనతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట కూడా ప్రకటించడం విశేషం.
అయితే ఈ జంట ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారనే ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని, అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉన్న తమ ఫొటోలను కూడా డిలీట్ చేశారంటూ ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్ల తమన్నా ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయగా.. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఉన్న ఫొటోలు డిలీట్ చేయలేదు. దీంతో కోపం వచ్చిన ఆమె ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయోద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.






