- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
A.M. Ratnam: ఆ వార్తలు నిజమే.. కారణజన్ముడ్ని అవుదామని ప్రయత్నించా.. తన ఆరోగ్యంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నిర్మాత షాకింగ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహరవీరమల్లు’(Hari Hara Veera Mallu).

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహరవీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ(Jyothikrishna) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక 12 రోజుల్లో విడుదల కావాల్సి ఉండగా.. ఈ నేపథ్యంలో.. నిర్మాత ఎ.ఎం రత్నం అస్వస్థతకు గురయ్యారని పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆసుపత్రిలో చేర్చినట్లు పలు పుకార్లు షికారు చేస్తుండటంతో అంతా అయోమయంలో పడిపోయారు. ‘హరిహర వీరమల్లు’ విడుదల సమయంలో ఇలా జరగడమేంటీ వాయిదా పడుతుందా? అని పవన్ అభిమానులు భయపడిపోయారు. తాజాగా, ఈ విషయంపై ఎ.ఎం రత్నం ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆయన అస్వస్థతకు గురయ్యాననే వార్తలు నిజమే అని చెప్తూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘అందరికీ నమస్కారం.. నాకు కళ్ళు తిరిగాయి అని మీడియా లో వస్తున్న వార్తలు వాస్తవమే.
అన్న గారి లాగా నలభై బజ్జీలు తిని కారణజన్ముడ్ని అవుదాం అని ప్రయత్నించాను. కానీ పది బజ్జీలకే నాకు bp వచ్చింది. అలాంటిది ఆయన నల్భై బజ్జీలు ఎలా తిన్నాడో మహానుభావుడు’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఆయనాల చేద్దాం అనుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఎందుకు ఈ సమయంలో ఇలాంటి పనులు అవసరమా అని అంటున్నారు. ఇక ఒక్య ట్వీట్‌తో ఎ.ఎం రత్నం తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. త్వరలో ట్రైలర్ విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.






