- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రౌడీ జనార్ధన' నుండి కొత్త పోస్టర్.. క్యాప్షన్‌తో స్టోరీ హింట్ ఇచ్చారుగా
ప్రపంచంతో పోరాడే వ్యక్తి కూడా... ప్రేమ ముందు తలవంచుతాడు. ఒక్క క్యాప్షన్‌తోనే స్టోరీ హింట్ ఇచ్చేసిన ‘రౌడీ జనార్ధన’ మేకర్స్.

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించనుండగా, రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో విజయ్ చేతిలో గన్ పట్టుకుని వర్షంలో కూర్చుని కనిపించగా, అతని గుండెపై ఓ యువతి కాలితో తన్నుతున్నట్లు చూపించారు. ఈ పోస్టర్‌కు “ప్రపంచంతో పోరాడే వ్యక్తి అయినా ప్రేమ ముందు మాత్రం తలవంచుతాడు” అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ క్యాప్షన్‌తోనే సినిమా కథలోని ప్రధాన భావాన్ని మేకర్స్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగడానికి ప్రపంచంతో పోరాడే వ్యక్తి, ప్రేమ కోసం మాత్రం ఎన్నో భావోద్వేగ సంఘర్షణలు ఎదుర్కొంటాడనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వైపు శత్రువులు, మరోవైపు ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.






