- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంకు బిగ్ షాకిచ్చిన నెటిజన్.. దెబ్బకు అలాంటి పోస్ట్ పెట్టేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి.. ‘కళ్యాణ మండపం’(Kalyana Mandapam)తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి.. ‘కళ్యాణ మండపం’(Kalyana Mandapam)తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన ‘క’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఒక్కసారిగా కిరణ్ అబ్బవరం రేంజ్ మారిపోయింది. దీంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఆయన వరుస చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘దిల్‌రూబా’(Dilruba) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్(Ruksar Dhillon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యాడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ‘దిల్‌రూబా’ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇక కిరణ్ అబ్బవరం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో చిట్ చాట్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన హీరోయిన్ రుక్సార్‌తో చాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, కిరణ్ అబ్బవరంను కొంతమంది నెటిజన్లు ఆటపట్టించారు. ఇక వీటికి అంతే సరదాగా కిరణ్ కూడా రిప్లై ఇచ్చారు. ఈ సంభాషణపై ఓ లుక్కేద్దాం. అసలు విషయంలోకి వెళితే.. ట్విట్టర్‌లో ఓ నెటిజన్ కేవలం హీరోయిన్స్‌తోనే చాటింగ్ చేస్తావా.. మాతో ఏం చెయ్యవా అన్నా అని పోస్ట్ పెట్టగా.. మరో నెటిజన్ రిప్లై ఇవ్వకుండే నీ జుట్టు రాలిపోతుందని అన్నాడు. ఇక ఈ పోస్టులపై స్పందించిన కిరణ్ అబ్బవరం ‘‘నీకు వందసార్లు హాయ్ తమ్ముడు’’ అని రిప్లై ఇచ్చాడు. అలాగే ఓ నెటిజన్‌కు అదేంటి బ్రో అంత మాట అంటారు. అని షాక్ అవుతున్న ఎమోజీ షేర్ చేస్తూ.. చెప్పండి మనం చాటుచేసుకుందాం’’ అని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ మూవీలో నటిస్తున్నారు.
Adenti bro antha mata antaru 😳.. Cheppandi Manam chat cheskundam 😃 https://t.co/Oj6qfLepj9
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025






