రామ్ నెక్స్ట్ మూవీలో పరిశీలనలో ఆ ఇద్దరు హీరోయిన్ల పేర్లు

by Pulgam srinivas |

రామ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీనిధి శెట్టి, సంయుక్త మీనన్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ నెక్స్ట్ మూవీలో పరిశీలనలో ఆ ఇద్దరు హీరోయిన్ల పేర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తానే స్వయంగా కథ రాసుకొని ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయనే హీరోగా కూడా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్లుగా నటించబోయే ముద్దుగుమ్మలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీనిధి శెట్టి, సంయుక్త మీనన్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ తొలిసారి తానే కథ రాసుకొని దర్శకత్వం వహించబోతున్న చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీని రామ్ సోదరుడు కృష్ణ చైతన్య నిర్మించనుండగా, సామ్ సి. ఎస్ సంగీతం అందించనున్నాడు.

Next Story