- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా
ఇందులో భాగంగా ‘సిగ్మా’ సినిమాలోని మొదటి పాట ప్రోమోను విడుదల చేస్తూ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గత ఏడాది ‘గుర్రం పాపిరెడ్డి’ అనే చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల ‘గాయపడ్డ సింహం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ‘సిగ్మా’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ స్టార్ హీరో, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని అఫీషియల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘సిగ్మా’ సినిమాలోని మొదటి పాట ప్రోమోను విడుదల చేస్తూ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టింది. "దోపిడీని స్టైల్‌గా పూర్తి చేస్తూ.. సిగ్మా నుండి మొదటి సింగిల్.. సిగ్మా స్టైల్ జూన్ 4న విడుదలవుతోంది. వేచి చూడండి" అంటూ ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేసింది. ఈ ప్రోమోలో సందీప్ కిషన్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.






