ఓటీటీలోకి వచ్చేస్తున్న మల్టీస్టారర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

by Chukka Sudharani |

మలయాళ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌‌గా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మల్టీస్టారర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
X

దిశ, సినిమా: మలయాళ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌‌గా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’. ఇద్దరు అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై ఆకట్టుకోగా.. విడుదలైన కొన్ని వారాలకే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ‘పేట్రియాట్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా.. జూన్ 5 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. మమ్ముట్టి, మోహన్‌లాల్ చాలా కాలం తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఇందులో ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ పాత్రలో నటించారు. నయనతార, కుంచాకో బోబన్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Next Story