‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందంటూ మూవీ టీమ్ పోస్ట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by I. Sairam |   (  Updated:2026-01-06 08:02:11  IST  )

యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly).

‘కపుల్ ఫ్రెండ్లీ’ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుందంటూ మూవీ టీమ్ పోస్ట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh Sobhan) నటిస్తున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). చెన్నై నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తోంది. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ భారీగా నిర్మిస్తోంది. అయితే ఆదిత్య రవీంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నానాలు చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించగా.. తాజాగా ఈ మూవీటీమ్ మరో అప్డేట్ రాబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘కపుల్ ఫ్రెండ్లీ డేట్ రేపు రివీల్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే రిలీజ్ డేట్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టర్‌లో హీరో హీరోయిన్ ఓ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుండగా.. ఆ టేబుల్ పై ‘కాబట్టి ఇది తేదీనా?’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Link

Read More..

రాజా సాబ్ నుంచి ‘నాచే నాచే’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్..

Next Story