Prabhas: ప్రభాస్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్‌ను తీసుకొస్తున్న మూవీ టీమ్.. మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prabhas: ప్రభాస్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్‌ను తీసుకొస్తున్న మూవీ టీమ్.. మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆయన చివరగా ‘సలార్’ మూవీతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు అన్ని చిత్రాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. సలార్-2, కల్కి-2(Kalki-2), ఫౌజి, ది రాజా సాబ్, వంటి సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. వీటితో పాటు ఆయన హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నట్లు టాక్. మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రం కోసం ప్రశాంత వర్మ ఓ క్రేజీ హీరోయిన్‌ను సంప్రదించారట.

డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ప్రభాస్‌కు జోడీగా నటించాలని చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse). ఈ అమ్మడు రవితేజ సరసన నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలై డిజాస్టర్ అయినప్పటికీ అమ్మడు నటనకు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె రామ్ పోతినేని రాపో-22, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలోనూ నటించనుందనే చర్చలు మొదలయ్యాయి. అయితే రాపో షూట్ పూర్తి కావస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కింగ్‌డమ్ కూడా సగానికి పైగానే అయిపోయినట్లు టాక్. కాబట్టి భాగ్రశ్రీ ప్రభాస్‌కు జోడీగా నటించేందుకు కచ్చితంగా ఒప్పుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story