స్టార్ యాక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ ‘అనుమాన పక్షి’ టీజర్‌ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by I. Sairam |   (  Updated:2026-01-08 08:02:01  IST  )

'డి.జె. టిల్లు' (DJ Tillu) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విమల్ కృష్ణ (Vimal Krishna) ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా 'అనుమాన పక్షి' (Anumana Pakshi).

స్టార్ యాక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ  ‘అనుమాన పక్షి’ టీజర్‌ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: 'డి.జె. టిల్లు' (DJ Tillu) సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విమల్ కృష్ణ (Vimal Krishna) ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా 'అనుమాన పక్షి' (Anumana Pakshi). ఇక ఇందులో రాగ్ మయూర్ హీరోగా నటిస్తుండగా.. మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్ ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రాబోతుందని ఓ స్టార్ యాక్టర్‌ రోల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘బ్రహ్మోస్ - ది ట్రేసర్ బుల్లెట్‌ని కలవండి.. లక్ష్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి.. జనవరి 11న అనుమానపక్షి టీజర్ వస్తుంది.. ఫిబ్రవరి 2026లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. DJ టిల్లు రచయిత-దర్శకుడి నుండి ఒక సినిమా’ అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో బ్రహ్మాజీ స్వెటర్ వేసుకుని చైనా వాళ్ల లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Next Story