ఈసారి మాస్ ఫీస్ట్ బోల్డ్‌గా అండ్ వైల్డ్‌గా ఉంటుందంటూ ఆ మూవీకి సీక్వెల్ ప్రకటించిన మూవీ టీమ్.. హైప్ పెంచుతున్న పోస్టర్

by I. Sairam |   (  Updated:2025-04-17 13:22:30  IST  )

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

ఈసారి మాస్ ఫీస్ట్ బోల్డ్‌గా అండ్ వైల్డ్‌గా ఉంటుందంటూ ఆ మూవీకి సీక్వెల్ ప్రకటించిన మూవీ టీమ్.. హైప్ పెంచుతున్న  పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందించగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించారు.

అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల అయి భారీ విజయాన్ని సాధించింది. అలాగే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకు సీక్వెల్ ప్రకటించారు మూవీ టీమ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

అందులో జాట్-2 పోస్టర్‌ను షేర చేస్తూ.. ‘బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ తర్వాత #JAAT విశ్రాంతి తీసుకోవడం లేదు.. అతను కొత్త లక్ష్యం వైపు వెళ్తున్నాడు. ఈసారి, మాస్ ఫీస్ట్ పెద్దదిగా, బోల్డ్‌గా మరియు వైల్డ్‌గా ఉంటుంది’ అని రాసుకొస్తూ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://x.com/peoplemediafcy/status/1912760607578943711

Next Story