ఆడియన్స్‌కు మ్యాజికల్ ట్రీట్ ఇవ్వబోతున్న ‘సూర్య s/o కృష్ణన్’ మూవీ.. ఆ స్పెషల్ డే నాడే రీరిలీజ్ (ట్వీట్)

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి వస్తూ దుమ్మురేపుతున్నాయి.

ఆడియన్స్‌కు మ్యాజికల్ ట్రీట్ ఇవ్వబోతున్న ‘సూర్య s/o కృష్ణన్’ మూవీ.. ఆ స్పెషల్ డే నాడే రీరిలీజ్ (ట్వీట్)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి వస్తూ దుమ్మురేపుతున్నాయి. గతంలో ఫ్లాప్ అయిన సినిమాలో కూడా రీరిలీజ్‌లో ప్రేక్షకులను అలరించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఇటీవల ఎన్నో చిత్రాలు పండుగలకు లేదా ఏదైనా స్పెషల్ డే నాడు థియేటర్స్‌లోకి వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో వాలెంటైన్స్ డే ఉండటంతో కొన్ని సినిమాలు రీరిలీజ్‌కు సిద్ధమైయ్యాయి.

ఈ క్రమంలో.. తాజాగా, స్టార్ హీరో నటించిన ‘సూర్య s/o కృష్ణన్’(Surya s/o Krishnan) మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ లవ్ స్టోరీ రీరిలీజ్ కాబోతుంది. అయితే కోలీవుడ్ హీరో సూర్య(Surya), సమీరా రెడ్డి(Sameera Reddy), దివ్య స్పందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. దీనిని వేణు రవిచంద్రన్(Venu Ravichandran) నిర్మించిన ఈ మూవీ తమిళంలో ‘వారణం అయిరం’ పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో దీనిని తెలుగులో ‘సూర్య s/o కృష్ణన్’ పేరుతో 2008లో నవంబర్ 14న విడుదలై సెన్సేషన్ సృష్టించింది. కాగా, ఇప్పటికే ఒకసారి థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా లవర్స్ డే సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story