- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న ‘షష్టిపూర్తి’ సినిమా.. మీ హృదయాల్లో చాలాకాలం ఉండే కథ అంటూ మేకర్స్ ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చనా(Archana) జోడీగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టి పూర్తి’(Shashtipoorthi) .

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చనా(Archana) జోడీగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టి పూర్తి’(Shashtipoorthi) . ఈ సినిమాలో రూపేష్, ఆకాంక్ష సింగ్(Akanksha Singh) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పవన్ ప్రభ(Pawan Prabha) తెరకెక్కిస్తున్నారు. దీనిని ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మిస్తున్నారు. అయితే సౌత్ సినీ రంగంలో సంగీత దిగ్గజాలు కీరవాణి, ఇళయరాజా ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేయడం మరొక ఆసక్తికరమైన విషయం. ఓ పాటకు ఇలయరాజా స్వరాలు అందించగా, ఒక పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సాహిత్యం అందించారు. ఇద్దరూ కలసి పనిచేసిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇలయరాజా కంపోజ్ చేసిన ‘ఏదో ఏదేదో’ పాటకు కీరవాణి రాసిన పదాలు ప్రస్తుతం సంగీతప్రియులను మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం అప్డేట్ విడుదల చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ‘షష్టిపూర్తి’ సినిమా మే 30న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘మీ హృదయాల్లో చాలాకాలం పాటు ఉండే కథను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ప్రజెంట్ సమ్మర్ హాలీడేస్ రావడంతో చాలామంది ఫ్యామిలీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఎక్కువగా.. లవ్ చిత్రాలే రాబోతుండటంతో అంతా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ‘షష్టిపూర్తి’ రాబోతుండటంతో సినీ ప్రియులు ఆనంద పడుతున్నారు.






