- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తూ మేర లవర్’ సాంగ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన మూవీ మేకర్స్.. అస్సలు ఊహించలేరుగా?
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల(sreeleela) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara ).

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల(sreeleela) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara ). భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో హైప్ పెంచాయి. ఇక ఇటీవల ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఇందులో హిట్ మూవీ ఇడియట్ ట్యూన్‌తో పాటు ఓ డ్యాన్స్ స్టెప్ కూడా పెట్టడంతో అందిరిలో ఫుల్ సాంగ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.
తాజాగా, మాస్ జాతర నుంచి ‘తూ మేర లవర్’ లిరికల్ సాంగ్‌ను చిత్రబృదం విడుదల చేసింది. ఇక ఇందులో రవితేజ హీరోయిన్ శ్రీలీలను తూ మేరక లవర్.. నేను నీకు ఇచ్చా ఫ్లవర్.. నా చెవితో పెట్టావే కాళీఫ్లవర్ నీలాగ నచ్చలేదే ఎవ్వరూ.. నా గొంతూ కోస్తివే దొంగ టీచర్ అని సాగే లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి పాట ఐకానిక్ స్టెప్పును రీక్రియేట్ చేయడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పోస్ట్‌కు మూవీ మేకర్స్ ‘‘ఇక నుంచి ఒకటే మ్యూజిక్ వినపడుతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.






