- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirzapur : సినిమాగా వచ్చేస్తున్న మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..
వెబ్ సిరీస్‌లో మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘మీర్జాపూర్’ (Mirzapur) సిరీస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: వెబ్ సిరీస్‌లో మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘మీర్జాపూర్’ (Mirzapur) సిరీస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం.. బ్లా్క్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా.. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు రికార్డు వ్యూస్ సొంతం చేసుకోగా.. ఇటీవల వచ్చిన మూడో భాగం కూడా దూసుకుపోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది.
ఈ పాపులర్ వెబ్ సిరీస్‌ను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి పూనిత్ కృష్ణ(Punit Krishna) కథను అందింస్తుండగా.. గుర్మిత్ సింగ్ (Gurmeet Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్(Excel Entertainment Banner)పై రితేష్ సిద్భవాని(Ritesh Sidhwani), ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar), కాసిమ్ జాక్ మార్కింగ్(Kasim Jack Marking), విశాల్ రసందనిడ (Vishal Rasamdanida) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మూవీ వెర్షన్‌లో రాబోతున్న ‘మీర్జాపూర్’ 2026లో థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినిమా ప్రియులు పండుగా చేసుకుంటున్నారు.






