- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌత్ సినిమాలకు ఆదరణ లేదు.. ఒక్క బాలీవుడ్ మూవీ చేసిన గుర్తుపట్టేవాళ్లు.. మన్మథుడు భామ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా 2002లో విడుదలైన 'మన్మథుడు' మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా 2002లో విడుదలైన 'మన్మథుడు' మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున బ్రహ్మనందం మధ్య కామెడీ, పాటలు అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఆడియన్స్‌ను అలరిస్తునే ఉంటాయి. ఇక ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్‌లో మహేశ్వరి పాత్రలో కనిపించిన హీరోయిన్ అన్షు అంబానీ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న 'మజాకా' సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్షు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అన్షు అంబానీ మన్మథుడు మూవీలో నటించే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు. అయితే, ఆ వయసులో యాక్టింగ్‌ను కేరీర్‌గా చూడలేదని, అందుకే చదువుపై దృష్టి పెట్టాలని సినిమాలను వదిలేసి లండన్ వెళ్లిపోయినట్లు చెప్పారు. సైకాలజీ పూర్తి చేసి థెరపిస్ట్‌గా వర్క్ చేసినట్లు తెలిపారు. 2023లో మన్మథుడు మూవీ రీరిలీజ్ అయినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి హైదరాబాద్ వచ్చానన్నారు. ఈ సందర్భంగా కొన్ని పాడ్‌కాస్ట్‌లో పాల్గొనటంతో మళ్లీ తనకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. 'మజాకా' మూవీలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, అయితే, యాక్టింగ్‌కు చాలా గ్యాప్ రావటంతో ఏమైనా తప్పులు ఉంటే అర్థం చేసుకోవాలని కోరారు. మన్మథుడు సినిమాకు తాను 13 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే.. ఈ సినిమా కోసం ఏకంగా 60 రోజులు వర్క్ చేసినట్లు తెలిపారు.
ఇక అన్షు లండన్ వెళ్లిన సమయంలో అక్కడ ఏదైనా ఏజెన్సీతో కలిసి వర్క్ చేయాలనుకున్నట్లు చెప్పారు. 28 ఏజెన్సీలు తన ప్రొఫైల్‌ను రిజెక్ట్ చేశాయని, 'నువ్వు ఏం సినిమాలు చేశావు?', 'ఆ సినిమా పేర్లు మేము ఎప్పుడూ వినలేదు?', 'నువ్వు ఎవరు?' అన్నట్లుగా మాట్లాడేవారని తెలిపారు. అప్పట్లో సౌత్ సినిమాలకు అంత విలువ లేదని, ఒకవేళ అప్పట్లో తాను ఒక్క బాలీవుడ్ సినిమా చేసిన గుర్తుపట్టే వాళ్లని అన్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయని, సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని అన్షు తెలిపారు. 'మజాకా' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంట తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది.






