- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: డైరెక్టర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్.. అస్సలు వెలకట్టలేను అన్నయా అంటూ ఎమోషనల్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ఏజ్‌లో కూడా ఆయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ (Vishvambhara)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు చిరు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఇందులో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఇటీవల మూవీ మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్ ఇచ్చిన బాబీ(Bobby)తోనూ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగాస్టార్, డైరెక్టర్ బాబీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతికి అస్సలు వెలకట్టలేను. థాంక్యూ అన్నయా.. ఈ గిఫ్ట్‌ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’’ అని రాసుకొచ్చారు. అలాగే ఆయన చేతికి మెగాస్టార్ ఖరీధైన వాచ్ పెడుతున్న ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా వాచ్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.






