- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. క్లాప్ కొట్టి ‘మెగా-158’ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా-158’ పూజా కార్యక్రమాలు నేడు (మే 21న) హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మెగా బ్రదర్స్‌తో పాటు ప్రముఖ దర్శకులు సాగర్ కె. గోపాల్, కోదండరామిరెడ్డి కలిసి దర్శకుడు బాబీకి స్క్రిప్ట్‌ను అందజేశారు.
ముహూర్తపు షాట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, మెగాస్టార్ కుమార్తె, ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా ఒక కీలక పాత్రలో నటించబోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కూడా ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగా కుటుంబం మొత్తం ఏకమై జరిపిన ఈ సినిమా ఓపెనింగ్ వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. పూజ ముగియడంతో త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఇక ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా? అని సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి.






