ఆ అవార్డు అందుకున్న మెగా బ్యూటీ.. చాలా హ్యాపీగా ఉందంటూ హాట్ ఫొటోస్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-01 03:16:07  IST  )

‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ అవార్డు అందుకున్న మెగా బ్యూటీ.. చాలా హ్యాపీగా ఉందంటూ హాట్ ఫొటోస్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’(Uppena) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ పత్తా లేకుండా పోయింది. కానీ ఆ హీరో ఈ హీరో సినిమాల్లో ఆఫర్లు అందుకుందని కొన్ని గాసిప్స్ అయితే వస్తున్నాయి. అయితే మలయాళంలో మాత్రం వరుస చిత్రాల్లో నటిస్తూ రాణిస్తోంది.

ఇదిలా ఉంటే.. కృతి శెట్టి నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కృతి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘యూత్ ఐకాన్ అవార్డుకు @galattadotcom కి ధన్యవాదాలు. మంచి ప్రభావం చూపే వ్యక్తిగా అండ్ సానుకూలతకు మూలంగా ఉండటమే నేను నిజంగా కోరుకునేది. ఈ సంవత్సరం చాలా ఆసక్తికరమైన అనుభవాలతో నిండి ఉంది.

నేను ఎల్లప్పుడూ దయను వ్యాప్తి చేయడానికి మరియు ప్రజలకు సందేహం యొక్క ప్రయోజనాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాను కానీ మీ మంచితనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులను నేను తరచుగా చూశాను. అందుకే మీరు మీ దయ, మీ పట్ల గౌరవాన్ని రాజీ పడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. దయతో వారిని చంపుదాం.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 5వ స్లయిడ్ మీరు నా కళ్ళను ప్రేమ, ఆనందం మరియు ఆనందంతో ఎలా నింపుతారో చూపిస్తుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నందుకు గానీ ఈ అమ్మడుకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story