- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న మెగా బ్యూటీ.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?
యంగ్ బ్యూటీ షాజన్ పదంసీ(Shazahn Padamsee) ‘రాకెట్ సింగ్:సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాజన్ పదంసీ(Shazahn Padamsee) ‘రాకెట్ సింగ్:సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘ఆరెంజ్’(Orange) చిత్రంలో నటించి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇందులో రామ్ చరణ్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించిన ఆమె తన నటన, అందంలో మెస్మరైజ్ చేసింది. అయితే రుబా పాటతో చాలా ఫేమస్ అయిన ఆమె స్కిన్ షో చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్(Venkatesh) ‘మసాలా’ మూవీలో రామ్ సరసన నటించింది. ఇక తెలుగు, హిందీ తమిళ చిత్రాల్లో నటించిన షాజన్ 2023 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా షాజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆశిష్‌తో ప్రేమలో ఉంది. ఇక గత ఏడాది నవంబర్‌లోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. తాజాగా, షాజన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జూన్ 5న పెళ్లి జరగనుండగా.. జూన్ 7న సంగీత్ వేడుక, ఆ తర్వాత పలు పార్టీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి షాజన్, ఆశిష్ కుటుంబ సభ్యులు,సన్నిహితులు హాజరవుతారు. ఇక ఈ తెలుసుకున్న నెటిజన్లు షాజన్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.






