బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ఎన్‌సి-24 మూవీతో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఓ పక్క సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ శారీ కట్టుకొని, ఒంటినిండా నగలు పెట్టుకుంది. అలాగే బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని స్టైలీష్‌గా ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి ‘కొంచెం మస్తీ వస్తీ’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో బ్యూటిఫుల్ అని తెగ పొగిడేస్తున్నారు.

Next Story