- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొల్లాచ్చి బాట పట్టిన ‘మెగా 158’ టీం.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
‘మెగా 158’ మూవీ తదుపరి షెడ్యూల్ జూన్ 1 నుంచి పొల్లాచ్చిలో ప్రారంభం కానుండగా, దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ కూడా తాజాగా ప్రారంభమైంది. ఇందులో చిరంజీవి కూతురు పాత్రలో కనిపించనున్న అనశ్వర రాజన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ రెండో షెడ్యూల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
దీంతో ఈరోజే మూవీ టీం హైదరాబాద్ నుంచి పొల్లాచ్చికి బయలుదేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక్కడ సుమారు 15 రోజుల పాటు చిత్రీకరణ జరగనుండగా ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మూవీ బృందం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






