- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ఏ.. కెనడాలో ప్రీమియర్స్ ద్వారా ఆ మార్క్ టచ్ చేసిన పెద్ది
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్ఏ, కెనడా ప్రాంతాల్లో కలిపి పెద్ది సినిమాకు ప్రీ సేల్స్ ద్వారానే 192K గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్ఏ, కెనడా ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు ప్రీ సేల్స్ ద్వారానే 192K గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా, ఓవర్సీస్ ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శించనున్నారు. ప్రీమియర్స్‌కు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో బుకింగ్స్ రావడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
విడుదల తేదీకి ముందే ప్రీమియర్ ప్రీ సేల్స్‌తో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వరల్డ్‌వైడ్‌గా భారీ కలెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






